టీడీపీ ఎమ్మెల్సీగా గాలి సరస్వతమ్మ ఏకగ్రీవ ఎన్నిక
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా గాలి సరస్వతమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి ఆమెకు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు ఎంపీ శివప్రసాద్, జడ్పీ చైర్మన్ గీర్వాణి, ఎమ్మెల్సీ దొరబాబు, పులివర్తి నాని, మేయర్ హేమలత తదితరులు హాజరయ్యారు. తన ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించినవారందరికీ గాలి సరస్వతమ్మ కృతజ్ఞతలు తెలిపారు. గాలి ముద్దుకృష్ణమనాయుడి ఆశయాలను నెరవేరుస్తానని ఆమె అన్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఎమ్మెల్సీ పదవికి ఆయన భార్య గాలి సరస్వతమ్మను ఎంపిక చేసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.













