ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం : కేంద్ర మంత్రి షెకావత్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో కలిసి పోలవరం పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఇందుకూరు-1లో ఆర్అండ్ఆర్ పునరావాస కాలనీ, ఏనుగులగూడెంలో పోలవరం నిర్వాసితులతో కేంద్ర మంత్రి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. నివ్వాసితుల పునరావాస కాలనీని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో షెకావత్ మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యలన్నీ తీర్చాల్సిన అవసరముందన్నారు. పునరావాస కాలనీని పరిశీలించానని, వసతులు బాగున్నాయని తెలిపారు. పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.













