పోలవరం పూర్తయితేనే ఏపీ సస్యశ్యామలం : వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పోలవరం పూర్తయితేనే ఏపీ సస్యశ్యామలం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు తీసుకుని దీన్ని పూర్తిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. నిర్వాసితులకు కేంద్ర సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని, వారి జీవనోపాధిపై కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో రూ.6.8 లక్షల నుంచి 10 లక్షలు ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటామన్నారు. వైఎస్ హయాంలో భూసేకరణలో ఎకరం లక్షన్నరకే ఇచ్చిన వారికి రూ.5 లక్షలు ఇస్తామని తెలిపారు.













