తెలుగు సంబరాలు విజయవంతం కావాలి: ఆదిమూలపు సురేష్
అంధ్ర సారస్వత పరిషత 2022 జనవరి 7, 8 న భీమవరం వెస్ట్ బెర్రీ హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న తెలుగు సంబరాలను విజయవంతం చేయాలని, విద్యా శాఖ తమ వంతు సహకారం అందిస్తుందని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ తెలిపారని పరిషత్ అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ అన్నారు.
సంబరాల తెలుగు సదస్సులలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించే ఉపాధ్యాయులు, అధ్యాపకులకు జనవరి 7, 8 తేదీలలో పాల్గొనేందుకు ప్రభుత్వ పరంగా అనుమతించాలని కోరగా దానికి మంత్రి సానుకూలం గా స్పందించారని, తగు ఉత్తర్వులు యిస్తామని మంత్రి తెలిపారని డా. గజల్ శ్రీనివాస్ అన్నారు. శ్రీ ఆదిమూలపు సురేష్ సంబరాల కు విశిష్ట అతిధిగా విచ్చేస్తారని, ఆయనను ఒంగోలు లో వారి కార్యాలయంలో కలిసి ఆహ్వానించినట్లు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు.
శ్రీ భట్టిప్రోలు శ్రీనివాసరావు మీడియా కమిటీ చైర్మన్.













