చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి
ఉమ్మడి కడప జిల్లాలో పునర్విభజనలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి టీడీపీలో చేరారు. ఆయన బావ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సునంద రెడ్డి దంపతులు మినహా ఇతర కుటుంబ సభ్యులంతా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వీరికి చంద్రబాబు పార్టీ కండువా కప్పి టీడీకీలోకి ఆహ్వానించారు. ద్వారకానాథరెడ్డి మేనకోడలు అలేఖ్య రెడ్డి.. దివంగత సినీటుడు నందమూరి తారకరత్న సతీమణి. 1994లో టీడీపీ నుంచి ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం రద్దు కాగా, పలు మండలాలు రాయచోటిలో విలీనమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయడుతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.













