దీనికోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు : మంత్రి ధర్మాన
విశాఖలో రాజధాని ఏర్పాటైతే మన భవిష్యత్ బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా అసరవల్లిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనికోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని విశాఖ రాజధాని అని ఏక కంఠంతో మాట్లాడితే చాలన్నారు. నాడు చెన్నై, కర్నూలు, హైదరాబాద్ పరుగెత్తాం. మా ప్రాంతానికి రాజధాని వస్తే చంద్రబాబుకు వచ్చిన అభ్యంతరం ఏంటి? అంటూ ప్రశ్నించారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై మంత్రి ఘాటుగా స్పందించారు. మా పీక కోసేందుకు అమరావతి నుంచి అరసవల్లికి వస్తారా? మా ప్రాంతాలు అభివృద్ధి చెందనక్కర్లేదా? అని ప్రశ్నించారు. విశాఖ రాజధానికి అడ్డొస్తే రాజకీయంగా చితక్కొట్టాలి అని అన్నారు.













