మహిళలకి ఉచిత శిక్షణా కేంద్రం – విజయవాడ – 15వ వార్షికోత్సవం
విజయవాడ ప్రాంతంలో ఆర్ధికంగా వెనుకబడిన మహిళలకి జీవనోపాధి కలిగించే వయోజన విద్యలు నేర్పిస్తున్న స్వచ్ఛంద “ఉచిత శిక్షణా కేంద్రం” వచ్చే నెల..అనగా డిశంబర్, 25, 2022 క్రిస్టమస్ పండుగ నాడు 15వ వార్షికోత్సవం జరుపు కొంటోంది. అంతే కాదు. ఆ సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ రచయిత, నా గురుతుల్యులు శ్రీ కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి గారి 96వ జన్మదిన వేడుకలు కూడా అదే రోజున జరుగుతాయి! ఈ సందర్భంగా శాస్త్రి గారికీ, ఆయన నిరంతర సమాజ సేవా తత్పరతకి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్న ఆ ఉచిత మహిళా శిక్షణా కేంద్ర వార్షికోత్సవాలకీ మనందరి తరఫునా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. స్థానిక గాయత్రీ సేవా సమితి వారు విజయవాడ సత్యన్నారాయణ పురం చల్లపల్లివారివీధిలో మారుతీ వ్యాయామ శాల సమీపాన ఉన్న రెండస్థుల భవనంలో నిర్వహించబడుతున్న ఈ శిక్షణా కేంద్రం లో ఇప్పటికీ 3000 మంది దిగువ మధ్య తరగతి మహిళలు కంప్యూటర్ లో తెలుగు టైపింగ్, డేటా ప్రాసెసింగ్, కుట్టు పనులు మొదలైన వయోజన విద్యలలో శిక్షణ పొంది తమ కాళ్ల మీద తామే నిలబడి జీవనోపాధి సంపాదించుకుంటున్నారు. విజయవాడలో సాధించిన ఈ సత్ఫలితాల స్ఫూర్తితో ఈ శిక్షణా కేంద్ర కార్యక్రమాలని గుంటూరు, తెనాలి శివారులలో కూడా ప్రారంభ అయ్యాయి.
ఈ మూడు ఉచిత శిక్షణా కేంద్రాలకీ కావలసిన కొన్ని కంప్యూటర్లు, కుట్టు మిషనులు, బల్లలు, కుర్చీలు, బీరువాలు మొదలైన అత్యవసర వస్తువులు, పరికరాలు అమెరికా దాతలు, భారత దేశం లో కీ. శే. ఎస్. పి. బాలూ గారి “ఎస్. పి. సాంబమూర్తి ఫౌండేషన్ మొదలైన సంస్థల సహకారంతో కొంత వరకూ సమకూరాయి. ఇదంతా శాస్త్రి గారి చిత్త శుద్ధి, నిజాయితీ కూడిన అసమాన కృషి, మీ వంటి సహృదయ వదాన్యుల సహకారంతో సాధ్యం అయింది. ఈ ఉచిత శిక్షణా సంస్థ ఫొటోలు, ప్రముఖ దిన పత్రిక “ఈనాడు” లో “సమాజ సేవలో మూడు దశాబ్దాలు” అనే మకుటంతో ప్రచురించబడిన ప్రశంసా పూర్వక వార్తా కథనం మొదలైనవి కొన్ని ఇక్కడ జత పరిచాను…మీ కోసం.
మీ ఆర్ధిక సహకారానికి మా విన్నపం
సాధించినది ఎంత ఉన్నా, సాధించ వలసినది ఇంకా ఎంతో ఉన్న మాట వాస్తవం. లాభాపేక్ష లేకుండా విజయవంతంగా నిర్వహించబడుతూ, వందలాది వెనుకబడిన మహిళలకి స్వయం ఉపాధి కలిగే కంప్యూటర్ లో తెలుగు, కుట్టు విద్య ఉచితంగా నేర్పిస్తున్న ఈ ఉచిత మహిళా వయోజన విద్య శిక్షణ ఉచిత శిక్షణ కోసం అనేక మంది మహిళలు ఎదురు చూస్తున్నారు. ఈ సంస్థ నిర్వహణ ఖర్చు నెలకి సుమారు $500 (30000 రూపాయలు.) ఈ నిర్వహణా వ్యయం, ఇప్పుడు అత్యవసరం అయిన మరి కొన్ని కంప్యూటర్లు, కుట్టు మిషన్ల కొనుగోలుకి వదాన్యులైన మీ విరాళాలు అర్థిస్తున్నాం. అమెరికాలో విరాళాలకి పన్ను రాయితీ లభిస్తుంది.
మరింత పురోగతిని సాధించడానికీ, శిక్షణ కోసం ఎదురుచూస్తున్న అనేక మంది బీద మహిళలకి ఉపాధి కలిగించడానికీ అదనపు కంప్యూటర్లు, కుట్టు మెషీన్లు, నిర్వహణ ఖర్చులకి సుమారు $2500-$3000 (రూ. 2-3 లక్షల రూపాయలు) అవసరం అని ఆ సంస్థ వారి అంచనా. ఆ మహిళా సంస్థ 15వ వార్షికోత్సవం, వ్యవస్థాపకులైన కె. వి. బి. శాస్త్రి గారి 96వ పుట్టిన రోజు సందర్భంగా ఆ సొమ్ము సేకరించి వారికి అందజేయడానికి మీ ఆర్ధిక సహకారం అర్థిస్తున్నాం….డిశంబర్ 10, 2022 లోపుగా
Appeal for Your Financial Support
We request generous donations in the USA or India to purchase additional computers, sewing machines for training purposes and to meet monthly maintenance expenses at the free vocational training center for underprivileged women in Vijayawada/Guntur/Tenali. All donations in the USA are tax-deductible. No amount is too small. Your generous support is instrumental in teaching income generating skills in computer DTP and tailoring to poor and lower middle-class women and helping them become economically independent. About 3000 women have already benefited from our free vocational educational services since 2007. We are now celebrating the 15th Anniversary of the Free Vocational Training Center for Women as well as the 96th birthday of its founder Sri K. V. B. Sastry garu on December 25, 2022 (Christmas Day) in Vijayawada. Sastry garu who is currently visiting his family in Houston, TX.
(All donations are tax-deductible in the USA (Federal Tax ID: 76-0444238)
(We appreciate your kind support by December 10, 2022)
(All donor names will be prominently recognized on site at the training center, Vijayawada)
HOW TO DONATE IN THE USA
On-Line through Zelle
Please send your generous donation through Zelle using our mail ID vangurifoundation@gmail.com or Phone # 832 594 9054. Please make sure to include your name, contact and purpose as “Women’s Coaching Center” in the memo section.
BY CHECK/Direct Deposit in the USA
Please make check payable to Vanguri Foundation of America and direct deposit in any Wells Fargo Bank in the following account.
Account Name: Vanguri Foundation of America, Inc.
Account #: 0631 938 461
Routing #: 111 000 659
Mailing Address: 3906 Sweet Hollow Court, Sugar Land, TX 77498
HOW TO DONATE IN INDIA
You can also donate generously in Indian Rupees in any amount by Bank Transfer to our Administrator as follows:
Account Name: Kaza Vandana (Mobile number: 9032496062)
A/c Number: 110031609587: IFSC code: CNRB0006071
Canara Bank, Laxmi Nagar branch, Vijayawada 520011
మీ సత్వర స్పందనకు, దాతృత్వానికి ముందుగానే మా ధన్యవాదాలు
For More Information, please contact
వంగూరి చిట్టెన్ రాజు
e-mail: vangurifoundation@gmail.com: ఫోన్: 1 832 594 9054
వీరభద్రశాస్త్రి
ఫోన్: 917013248081, E-mail: kvbsastri@gmail.com













