Handloom :ఏపీ ప్రభుత్వం శుభవార్త … నేటి నుంచే
ఆంధ్రప్రదేశ్లోని చేనేత కార్మికుల (Handloom workers ) కు కూటమి ప్రభుత్వం శుభవార్త (Good news ) చెప్పింది. జాతీయ చేనేత దినోత్సవానికి వారం ముందుగానే ఉచిత విద్యుత్ అమలుకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆమోదం తెలిపారు. నేటి ( ఆగస్టు 1) నుంచే ఉచిత విద్యుత్ (Free electricity ) అమలుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఈ పథకానికి రూ.125 కోట్ల వ్యయం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మగ్గాలు, 15 వేల మర మగ్గాలు కలిగిన కుటుంబాలకు ఈ పథకంతో లబ్దిచేకూరునుంది. సేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయడంపై మఖ్యమంత్రికి మంత్రి సవిత (Minister Savita ) ధన్యవాదాలు తెలిపారు.







