యువనేస్తం అర్హులు 4 లక్షలకు చేరుకుంటారని అంచనా
ముఖ్యమంత్రి యువనేస్తం :
డిసెంబర్ నెలలో ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ కింద పెన్షన్ అందుకున్న వారి సంఖ్య – 3,31,723, ఇచ్చిన మొత్తం రూ.80.77 కోట్లు
ఈనెలాఖరుకు ముఖ్యమంత్రి యువనేస్తం అర్హులు 4 లక్షలకు చేరుకుంటారని అంచనా.
పించన్లు తీసుకుంటున్న కళాకారులు అందరికీ ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించాలి. కళాకారుల సేవలు సద్వినియోగం చేసుకోవాలి
400 శిక్షణా కేంద్రాలకు తొలిబ్యాచ్ లో 11వేల మంది, రెండవ బ్యాచ్ లో 23వేల మందికి శిక్షణ ఇచ్చామని, రెండువారాల పాటు శిక్షణ ఇచ్చామని, హాజరైన వారిలో 40%మందిపైగా అదనపు నైపుణ్యం పెంచుకున్నారని వివరించిన అధికారులు.
యువత నైపుణ్యాలను పెంచడానికి ప్రభుత్వం తరఫున అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంజనీరింగ్ పట్టభద్రులలో మన రాష్ట్రమే ముందుంది. నైపుణ్యాభివృద్ధిలో ముందున్నాం.ఉన్నత విద్యాశాఖ,నైపుణ్యాభివృద్ధి సంస్థ దీనిపై మరింత దృష్టిపెట్టి దేశంలో మన రాష్ట్రమే ముందుండేలా శ్రద్ధపెట్టాలి. యవత ఆలోచనలన్నీ వినూత్న ఆవిష్కరణలపైన, నైపుణ్యాభివృద్ధిపైన ఉండేలా మనవంతు కర్తవ్యం నెరవేర్చాలి: ముఖ్యమంత్రి
ఈ 4లక్షల మందిలో ఏ నెలలో ఎంతమంది ఉద్యోగాలు పొందగలిగారు అనేది మన నైపుణ్యాభివృద్ధికి కొలమానం.
గృహనిర్మాణం :
ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 19,57,429 ఇళ్లు మంజూరు
నిర్మాణం పూర్తయిన ఇళ్లు 7,45,339
నిర్మాణ దశలో మరో 11,61,812 ఇళ్లు
ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణం కింద 10,00,086 ఇళ్లు మంజూరు కాగా 4,06,142 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది
పీఎంఏవై-ఎన్టీఆర్(గ్రామీణ్) పథకం కింద 1,20,943 ఇళ్లు మంజూరు, 43,071 ఇళ్ల నిర్మాణం పూర్తి
పీఎంఏవై-ఎన్టీఆర్(అర్బన్) పథకం కింద 3,86,804 ఇళ్లు మంజూరు, 69,963 ఇళ్ల నిర్మాణం పూర్తి
ఎన్టీఆర్ స్పెషల్ హౌసింగ్ కింద హుద్‌హుద్ బాధితులకు 9,170 ఇళ్లు మంజూరు చేయగా, 8,788 ఇళ్ల నిర్మాణం పూర్తి













