Venkaiah Naidu: అగ్రరాజ్యం ఆంక్షలు సరికాదు : వెంకయ్యనాయుడు

ప్రధాని మోదీ అనుసరిస్తున్న తీరుతో మనపై అమెరికా ఆంక్షలు ప్రభావం చూపబోవని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) పేర్కొన్నారు. పారిశ్రామికవేత్త వై.వి.సత్యనారాయణ (Y.V. Satyanarayana) రచించిన బిజినెస్ ఎథిక్స్ (Business Ethics) అనే పుస్తకాన్ని విశాఖలోని ఆక్సిజన్ టవర్స్‌లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమెరికా (America) ఆంక్షలు, టారిఫ్‌లపై వెంకయ్యనాయుడు స్పందించారు. అగ్రరాజ్యం సఖ్యతతో ఉండాలి తప్ప ఆంక్షలతో కాదు. ప్రజాస్వామ్య పరిపాలనలో ఇలాంటివి సరికాదు. స్వదేశీ వస్తు వినిమయాన్ని మనమందరం ప్రోత్సహించాలి. నేటితరం పిల్లలకు నైతికత, విలువలను నేర్పాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆక్సిజన్ టవర్స్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.