టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి రాజీనామా
కడప జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జ్గా ఉన్న ఆయన ఎంపీ టికెట్ ఆశించారు. అధినేత చంద్రబాబు తనకు అవకాశం ఇవ్వకపోవడంతో పాట పార్టీలో తగినంత గుర్తింపు లేదని కారణాలతో ఆయన తెలుగుదేశం పార్టీని వీడారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపారు. రాజంపేట లోక్‌సభ టికెట్‌ను చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే డీకే సత్యప్రభకు కేటాయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సాయిప్రతాప్ తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన 2016 మార్చిలో కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తన రాజకీయ భవిష్యత్తు ప్రణాళికపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.













