ఏపీ కొత్త గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను నియమిస్తూ రాష్ట్రపతి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. జస్టిస్ అబ్దుల్ నజీర్ సుప్రీం కోర్టు జడ్జిగా పలు కీలక తీర్పులు వెలువరించారు. అయోధ్య రామమందిరంపై ప్రతిష్ఠాత్మక తీర్పు ఇచ్చిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఆయన ఒకరు. ఇటీవలే పదవీ విరమణ చేశారు. జస్టిస్ నజీర్ 1958 జనవరి 5న కర్నాటకలోని బెలువాయిలో జన్మించారు. మంగళూరులో న్యాయవిద్య అభ్యసించారు. 1983లో కర్నాటక హైకోర్టులో అడ్వకేట్‌గా కెరీర్ ప్రారంభించారు. 2003లో కర్నాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తరువాత అదే కోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా అవకాశం దక్కించుకున్నారు. 2017 ఫిబ్రవరిలో జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది.













