కొత్త డీజీపీని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త డీజీపీగా ఆర్.పి ఠాకూర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిది. నేటితో డీపీపీ మాలకొండయ్య పదవీ విరమణ చేశారు. దీంతో కొత్త డీజీపీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేశారు. చివరకు ఠాకూర్‌ను డీజీపీగా ఖరారు చేశారు. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఆర్పీ ఠాకూర్ ఉన్నారు. ఠాకూర్ వచ్చాక అవినీతి అధికారుల భరతం పట్టారు. దీంతో డీజీపీగా ఠాకూర్ నియమించేందుకు అనుమానమే అని సావంగ్‌కే అవకాశం ఉందని మొదట ప్రచారం జరిగింది. డీజీపీ ఎంపికపై చంద్రబాబుతో అధికారులు భేటీ అయ్యారు. ఆ తరువాత ఎంపికపై చంద్రబాబు అన్ని కోణాల్లోనూ కసరత్తు చేసి చివరకు ఠాకూర్ వైపు మొగ్గు చూపారు.













