తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దేవెగౌడ
మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దేవెగౌడ పుట్టినరోజు సందర్భంగా గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన ఈ రోజు తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు రేవణ్ణతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో తిరుపతి చేరుకుని రహదారి మార్గంలో దేవెగౌడ తిరుమలకు చేరుకున్నారు. కర్ణాటక రాజకీయ పరిణామాలు, జేడీఎస్ కాంగ్రెస్‌ల మద్య పొత్తు ఈ పరిణామాలు ఫలించి, కర్ణాటక ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా అధికారం రావాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబలో చీలక వస్తున్నట్లు ఈ మధ్య తీవ్రంగా ప్రచారం జరుగుతుండటంతో కుమారుడు రేవణ్ణను వెంట పెట్టుకుని రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.













