Gorantla Madhav: పోలీసుల అదుపులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ భారతి (YS Bharathi )పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో చేబ్రోలు కిరణ్ (Chebrolu Kiran )ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మంగళగిరి (Mangalagiri) గ్రామీణ పోలీసులు అతడిని మంగళగిరి నుంచి గుంటూరు తరలిస్తుండగా, గుంటూరు వరకు పోలీసు వాహనాన్ని మాధవ్ వెంబడిరచారు. పోలీసు వాహనాన్ని అడ్డగించిన గోరంట్ల, కిరణ్ అంతు చూస్తామని బెదిరించారు. దీంతో విధులకు ఆటంకం కలిగించినందుకు పోలీసులు మాధవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.













