Sailajanath :వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజానాథ్
మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్ ( Sailajanath) వైసీపీలో చేరారు. ఏఐసీసీ సభ్యుడు, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి (Pratap Reddy)తో కలిసి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (YS Jagan) సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్-6ని అమలు చేయడం లేదు. మరోవైపు ప్రభుత్వ వైద్య కళాశాలల (Medical colleges )ను నిర్వీర్యం చేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తోంది. రాయలసీమ (Rayalaseema)లో రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదు అని ఆరోపించారు.













