టీడీపీలోకి కేంద్ర మాజీ మంత్రి ?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. గతంలో ఐదుసార్లు లోక్సభకు, ఓ మారు రాజ్యసభకు ఎన్నికైన ఆయన, గనులు, ఉక్కు, బొగ్గు శాఖల సహాయంత్రిగా, ఆపై గిరిజన సంక్షేమ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రిగానూ పనిచేశారు. విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను చంద్రదేవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. 2014లో ఏపీ విభజన తరువాత కాంగ్రెస్ తరపున అరకు నుంచి పోటీపడి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన కొత్తపల్లి గీత చేతిలో ఓడిపోయారు. ఆపై ఇన్నాళ్లూ కాంగ్రెస్లో కొనసాగిన ఆయన, పార్టీలో తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తానని చెప్పారు. ఇదిలావుంటే అరకు ప్రాంతంలో బలమైన పార్టీ అభ్యర్ధి కోసం ఎదురుచూస్తున్న తెలుగుదేశం నేతలు అప్పటికే కిశోర్ చంద్రేవ్ తో చర్చించినట్టు తెలుస్తోంది. ఆయన్ను ఆహ్వానించాలని చంద్రబాబు చేసిన సూచన మేరకు సీనియర్ నేతలు చంద్రదేవ్ను కలవగా, ఆయన కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమచారం.













