మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులకు రిమాండ్
తెలుగుదేశం పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులకు నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వారిద్దర్నీ పోలీసులు కర్నూలు జైలుకు తరలించారు. నంద్యాలలో నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో కొత్తపల్లి వద్ద టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో అఖిల ప్రియను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం పాణ్యం పోలీసు స్టేషన్కు తరలించారు. సెక్షన్ 307 కింద అఖిలప్రియపై కేసు నమోదు చేసి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం న్యాయస్థానం దంపతులకు రిమాండ్ విధించింది.













