సీఎం వైఎస్ జగన్ ను కలిసిన అనిల్ కుంబ్లే
భారత టెస్ట్ క్రికెట్ జట్టు మాజీ సారథి అనిల్‌కుంబ్లే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రీడల అభివృద్ధికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే తనవంతు సహకారం అందిస్తానని కుంబ్లే ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రస్తుతం జలందర్, మేరఠ్ వంటి నగరాల నుంచి అన్ని రకాల క్రీడా సామగ్రి తెచ్చుకుంటున్నందున, రాష్ట్రంలో ఆ పరిశ్రమ ఏర్పాటు అంశంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రిని కోరారు. దీని కోసం తన అనుభవాన్ని అందించేందుకు సిద్ధమని కుంబ్లే తెలిపారు.













