టిడిపిలో చేరిన చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ
భారీ ఎత్తున ప్రజావేదికకు తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు
పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
టిడిపిలో చేరిన చింతలపూడి నేతలు గంటా సత్యంబాబు, బొప్పన అంజయ్య, టి.లక్ష్మయ్య,కేశవరావు,సుబ్బారావు,బొల్లినేని శ్రీనివాసరావు వెల్ది కృష్ణమూర్తి, పెండ్యాల ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సంఘీభావంగానే టిడిపిలో చేరాం. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు నచ్చకే వైసిపికి రాజీనామా చేశాం. నోరు తెరిస్తే చంద్రబాబును విమర్శించడమే జగన్ పని. ఏపికి కేంద్రం చేసిన అన్యాయంపై నోరెత్తడు. నరేంద్రమోదిని పన్నెత్తి జగన్ విమర్శించడు. బిజెపి,టిఆర్ ఎస్ లతో జగన్ కుట్రలు నచ్చకే వైసిపికి రాజీనామా.ఈ పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ చంద్రబాబుకు మద్దతుగా నిలవాలి. 19ప్రాజెక్టులు పూర్తిచేసిన ముఖ్యమంత్రికి మద్దతివ్వాలి. పోలవరం 67% పూర్తిచేసినందుకే మద్ధతిస్తున్నాం. రాష్ట్రం మొత్తం టిడిపి వెన్నంటే నిలవాలి: మాజీ ఎమ్మెల్యే గంటా మురళి













