టీడీపీలోకి మాజీమంత్రి
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీలో మాజీమంత్రి ఒకరు చేరికకు రంగం సిద్దమైనట్లు తెలిసింది. వైస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వ హాయంలో మంత్రిగా పనిచేసిన కొండ్రు మురళి తెలుగుదేశం పార్టీలో చేరుందుకు ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుతో కొండ్రు మురళి పార్టీలో చేరికపై చర్చించినట్లు సమాచారం. ఈ నెల 31వ తేదీనగానీ, లేదా సెప్టెంబర్ 2వతేదీన గాని ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.













