అది ప్రపంచానికే స్ఫూర్తిదాయకం : టోనీ బ్లెయిర్
రియల్‌టైం గవర్నెన్స్ పనితీరు అద్భుతం, ఆమోఘం, స్ఫూర్తిదాయకం అంటూ బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంసల వర్షం కురిపించారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ పనితీరును 45 నిమిషాల పాటు ఆద్యంతం ఆసక్తిగా గమనించిన ఆయన చివరగా చేతులు జోడించి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అమేజింగ్.. అంటూ కితాబుచ్చారు. అతి ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు. ప్రకృతి విపత్తులను ఆంధ్రప్రదేశ్ సమర్థంగా ఎదుర్కొంటున్న తీరు ముచ్చటగొలిపిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త రాష్ట్ర పురోభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చానని, ఆర్టీజీఎస్ను సందర్శించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న విజయాలు అందరికీ ఆదర్శమని, ప్రపంచంలో ఇలాంటి వ్యవస్థ ఎక్కడా లేదని ఆయన పేర్కొన్నారు.













