ఆర్టీజీఎస్ ను సందర్శించిన టోనీ బ్లెయిర్
టోనీ బ్లెయిర్ కు ఆర్టీజీఎస్ పై వివరాలు అందిస్తున్న సీఎం. టోనీ బ్లెయిర్ కు ఆర్టీజీఎస్ రూపకల్పన చేసిన రాజశేఖర్ , ఇతర అధికారులను పరిచయం చేసిన సీఎం. ఆర్టీజీఎస్ గురించి సీఎం చెబుతున్న వివరాల్స్ను ఆసక్తిగా వింటున్న టోనీ. గతంలో టోనీ, తనకు మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్న సీఎం. ప్రపంచంలో టోనీ పాలన గొప్పప్రభావాన్ని చూపిందన్న సీఎం. హైదరాబాద్ లో తాను సృష్టించిన ఎకో సిస్టం మూలంగా జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకున్న సీఎం. విభజన తర్వాత నవ్యాంధ్రలో అన్నీ రంగాల్లో కింది స్థాయి నుంచీ మొదలు పెట్టుకోవాల్సి వచ్చిందన్న సీఎం. పరిపాలనలో ఏడు మిషన్లు, అయిదు గ్రిడ్స్ రూపొందించుకుని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధిని సాధిస్తున్న విధానాన్ని వివరించిన సీఎం.
ఆర్టీజీఎస్ పని తీరును వివరిస్తున్న సీఈవో అహ్నద్ బాబు. రాష్ట్రంలో ఈ ఆఫీసును ప్రవేశపెట్టామన్న బాబు. ఆఖరికి సీఎం కూడా ఈ సంతకం చేస్తారన్న బాబు. బయో మెట్రిక్ ప్రవేశపెట్టినట్లు, ప్రధానంగా పాఠశాలల్లో ఫలితాలనిస్తోందన్న బాబు. పరిపాలనకు సంబంధించి ఏపీ క్లౌడ్ హబ్ ,బిగ్ డేటా సెంటర్ ను ప్రారంభిస్తున్నట్లు చెప్పిన సీఎం. ఈ విభాగంలో ఇద్దరు సాంకేతిక నిపుణులతో సంప్రదింపులు జరిగాయి. కంటెంట్ నాలెడ్జ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం.
ఈ ప్రగతిపై వివరణ
భూగర్భ జలాలు, రిజర్వాయరుల సామర్ధ్యం, వర్షపాతం, గాలి సాంధ్రత, వాతావరణంపై రియల్ టైం సమాచారం సేకరిస్తామన్న సీఎం. వ్యవసాయం రంగం సాగులోనూ ఆర్టీజీఎస్ ఉపయోగిస్తున్న తీరును వివరించిన వ్యవసాయ శాఖ కార్యదర్శి రాజశేఖర్. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇరవై వేల సీసీ కెమెరాల ఏర్పాటుపై ఆశ్చ్యర్యం వ్యక్తం చేసిన టోనీ బ్లెయిర్. నాలుగు వేల ప్రభుత్వ పాఠశాల్లో వర్చువల్ తరగతుల ఏర్పాటును వివరించిన సీఎం.
పాఠ్యాంశాల రూపకల్పనకు. లాబ్ ఏర్పాటు
డ్రోన్స్ ఉపయోగించి అటవీ ప్రాంతాల్లో, సుదూర తీరాల్లో ఎత్తైన కొండలలో అక్రమంగా పెంచుతున్న గంజాయి.పంటను గుర్తించి నాశనం చేస్తామన్న సీఎం. ముఖ్యమంత్రి నేతృత్వంలో అన్ని విభాగాల సమాచారాన్ని కోర్ డాష్ బోర్డులో నమోదు చేస్తాం. గ్రీవాన్స్ కేంద్రంలో మూడు వేలమంది 1100 ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు చేస్తారు. ఆర్టీజీఎస్ విధానం ప్రపంచంలో ఎక్కడా లేదని ప్రశంసించిన టోనీ బ్లెయిర్. టోనీ బ్లెయిర్ ను సన్మానించిన సీఎం. ఆర్గానిక్ అరకు కాఫీ గురించి చెప్పిన సీఎమ్. సచివాలయంలో టోనీ బ్లెయిర్ కు ఆతిధ్యమిచ్చిన సీఎం.
టోనీ బ్లెయిర్ ను కలసిన మంత్రులు లోకేష్, పుల్లారావు, నక్కా ఆనందబాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేటా, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర గంటపాటు ఆర్టీజీఎస్ లో గడపిన టోనీ బ్లెయిర్. ఆర్టీజీఎస్ సందర్శకుల పుస్తకంలో సంతకం చేసిన టోనీ బ్లెయిర్.













