దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం
దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణంలో గరిష్ఠ పెరుగుదల సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021ను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ విడుదల చేశారు. ఇందులో గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లో 647 చదరపు కిలో మీటర్ల మేర అటీ విస్తీర్ణంలో పెరుగుదల సాధించి టాప్లో నిలిచింది. 632 చదరపు కిలో మీటర్లతో తెలంగాణ రెండో స్థానంలో, 537 చదరపు కిలోమీటర్ల పెరుగుతలతో ఒడిశా మూడో స్థానంలో నిలిచాయి. గత రెండేళ్లలో దేశంలోనే మొత్తం అడవులు, చెట్ల విస్తీర్ణంలో 2,261 చదరపు కిలోమీటర్ల మేర పెరుగుదల నమోదైందని నివేదిక వెల్లడించింది.













