ఆస్ట్రేలియా మహిళ భారత్ లో.. పాదయాత్ర
ఆస్ట్రేలియాకు చెందిన జార్డిమోర్ అనే మహిళ భారత్లో అద్వైత ప్రచారం చేస్తున్నారు. ఆమె ఆదిశంకరాచార్య సంప్రదాయాన్ని అనుసరిస్తూ అద్వైత సిద్దాంతాన్ని ప్రచారం చేస్తూ భారత్లో 6,000 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టారు. ఇందులో భాగంగా విశాఖ చినముషిడివాడలోని శ్రీశారదా పీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. పీఠంలోని శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు, ఇతర దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. జార్డి మోర్ మాట్లాడుతూ ఒడిశాలోని పూరీలో ప్రారంభమైన తన పాదయాత్ర కేరళలోని కాలడి మీదుగా చార్ధామ్ వరకు ఆరు నెలలు సాగుతుందని వివరించారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ ప్రాంతానికి చెందిన తాను వృత్తిరీత్యా యోగ టీచర్నని తెలిపారు.













