విజయవాడలో ఫారిన్ పోస్టాఫీస్
విజయవాడ నుంచి విదేశాలకు పంపే వస్తువులను వినియోగదారులకు తక్కువ సమయంలో చేర్చే ఫారిన్ పోస్టాఫీసు శాఖ విజయవాడలో ఏర్పాటు కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ శాఖను ఏర్పాటు చేసుకోబోతున్న తొలి నగరం విజయవాడ. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌కు పక్కన ఉన్న తపాల శాఖ కార్యాలయంలో ఫారిన్ సబ్ పోస్టాఫీసును ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర తపాల శాఖ నుంచి వచ్చిన నిపుణుల బ ందం దీన్ని పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ.2 కోట్లతో ఈ పోస్టాఫీసును ఏర్పాటు చేయబోతున్నారు. రెండు, మూడు నెలల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.













