అమరావతి రైతులు కీలక నిర్ణయం…. పాదయాత్రకు
అమరావతి రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా మహాపాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకొని పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని రైతులు వెల్లడిరచారు. కోర్టుకు సెలువులు ఉన్నందున పాదయాత్రకు నాలుగు రోజులు తాత్కాలిక విరామమేనని ఐకాస పేర్కొంది. నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం వైసీపీ రోడ్డు నుంచి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రైతులు బస చేస్తున్న ఫంక్షన్ హాల్‌ను ఈ ఉదయాన్నే పోలీసులు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టారు. రైతులను కలిసి మద్దతు తెలిపేందుకు బయటనుంచి వచ్చే వారిని సైతం అనుమతించలేదు. సంఫీుభావం తెలిపేందుకు వస్తున్న వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు.
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా పాదయాత్రలో పాల్గొనే 600 మంది గుర్తింపు కార్డులు చూపించాలని అనుమతి ఉన్న వాహనాలు కాకుడా మిగతావి అంగీకరించబోమని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో రైతులు, పోలీసులకు స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఐకాస నేతలు సమావేశం ఏర్పాటు చేసి పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులు మహిళలను తీవ్రంగా గాయపరిచారు. మహిళల భద్రత పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాం. రైతులను ఇబ్బంది పెట్టే విధంగా పోలీసు, ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. పాదయాత్ర తాత్కార విరామం మాత్రమే ప్రకటించాం. తదుపరి కార్యచరణ చర్చించి ప్రకటిస్తాం. ఎదురౌతున్న అడ్డంకులన్నింటీని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాం అని ఐకాస నేతలు స్పష్టం చేశారు.













