పుట్టపర్తి, సాగర్ కు విమాన సేవలు
వచ్చే నెల నుంచి విజయవాడ నుంచి పుట్టపర్తి, నాగార్జునసాగర్ మధ్య విమానయాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో ప్రారంభ తేదీని ఖరారు చేయనున్నారు. బిడ్లను ఆహ్వానించినపుడు మిగతా సంస్థల కంటే సుప్రీం ఎయిర్‌లైన్స్ తక్కువ ఖర్చుకు నడిపేందుకు ముందుకు వచ్చిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి రాగానే సుప్రీం ఎయిర్‌లైన్స్‌తో అవగాహన ఒప్పందం చేసుకొని సేవలు ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి పుట్టపర్తికి రోజూ ఉదయం 7 గంటలకు విమానం బయలుదేరి 8:30 గంటలకు చేరుకుంటుంది. తిరిగి 9 గంటలకు పుట్టపర్తిలో బయలుదేరి 10:30 గంటలకు విజయవాడకు రానుంది. సాయంత్రం మళ్లీ 5 గంటలకు మరో సర్వీసు నడపనున్నారు. విజయవాడ నుంచి నాగార్జునసాగర్ ఉదయం 11 గంటలకు బయలుదేరే విమానం తిరిగి సాయంత్రం 3 గంటలకు వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.













