ఐఎస్ బీపై ముఖ్యమంత్రి చెప్పిన ఫ్లాష్ బ్యాక్
ఒకప్రాజెక్టు రావడానికి ఒక విశ్వసనీయత. దానివెనుక ఎంతో శ్రమ ఉంటుంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
హైదరాబాద్ కు ఐఎస్ బి తేవడానికి, మైక్రో సాప్ట్ తేవడానికి పడ్డ కష్టం గుర్తుచేసిన ముఖ్యమంత్రి
కియా మోటార్స్ అనంతపురం తేవడానికి పడ్డ శ్రమ వివరించిన సీఎం చంద్రబాబు
ఐఎస్ బీ ఈరోజు ఇండియాలో నెంబర్ వన్, వరల్డ్‌లో 24 వ స్థానంలో నిలిచిందంటే ఆరోజు దాన్ని హైదరాబాద్ తీసుకురావడానికి నేను చేసిన శ్రమ గుర్తుకువస్తోంది.
ఆరోజు ఐఎస్ బీ ప్రతినిధులు దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కడ పెట్టాలో అధ్యయనం చేయడానికి వెళ్లినపుడు వారిని హైదరాబాద్ పిలిపించాను. ఇద్దరు మంత్రుల్ని వారిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్టుకు పంపించాను. పోర్టికోలో నేనే స్వయంగా బొకేలిచ్చి రిసీవ్ చేసుకున్నాను. మీరు ఎటువంటి రాయితీలు ఇస్తామో చెప్పమని నన్ను అడిగారు. మీరు చెన్నయ్, బెంగళూరు వెళ్లి రండి. అక్కడ ఇచ్చే ప్రోత్సాహకాలకు ప్లస్ చేసి ఇక్కడ ఇస్తానని చెప్పాను. ఆయా నగరాలకు వెళ్తే వీరిని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. చెన్నయ్ వెళ్తే బొకేలు వీరికిచ్చి ముఖ్యమంత్రికి ఇమ్మన్నారు. ముంబయ్ వెళితే అసలు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు. చివరికి వాళ్లు హైదరాబాద్ వచ్చారు. ఇక్కడే ఐఎస్ బీ పెడతామన్నారు.
60ఏళ్ల శ్రమ, కష్టం వదులుకుని ఇక్కడికి వచ్చాం. ప్రజలను,ఉద్యోగులను అభినందిస్తున్నా. కష్టమైనా, నష్టమైనా భరించారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారు: ముఖ్యమంత్రి
కేంద్రం సహకరించి వుంటే దేశాభివృద్ధికి మరింత భాగస్వాములం అయ్యేవాళ్లం. సహకరించకపోగా, మాపొట్ట కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారు?













