ఐదుగురు టీటీడీ ధర్మకర్తల మండి సభ్యుల ప్రమాణం

తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) ధర్మకర్తల మండలి సభ్యులుగా కృష్ణమూర్తి వైద్యనాథన్, సౌరభ్ హెచ్ బోరా, నన్నపనేని సదాశివరావు, డాక్టర్ పనబాక లక్ష్మి, జ్యోతుల నెహ్రూ పదవీ ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయంలోని స్వామివారి సన్నిధిలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి వీరితో ప్రమాణం చేయించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, అదనపు ఈవో తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.