Kachidi Fish :మత్స్యకారులకు కచిడి పండుగ.. ఈ చేపల ధర రూ.1.40 లక్షలు!
సముద్రంలో వేటకు వెళ్లిన ఈ మత్స్యకారుల వలకు రెండు కచిడి చేపలు(kachidi fish) చిక్కడంతో పండుగ ఒకరోజు ముందే వచ్చినట్లయింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం (Atchutapuram) మండలం పూడిమడక మత్స్యకారులకు దొరికిన ఆ చేపల ధర రూ.1.40 లక్షలు పలికింది. వీటిని కొనుగోలు చేయడానికి వ్యాపారులు పోటీపడ్డారు. పూడిమడకకు చెందిన వ్యాపారి వీటిని కొనుగోలు చేసి కోల్కతా(Kolkata )కు ఎగుమతి చేయడానికి ఏర్పాట్లు చేశారు. మగ కచిడి చేపలు బంగారు వర్ణంలో కనిపిస్తాయని, అందుకే వీటిని గోల్డెన్ ఫిష్ అంటారని చెబుతున్నారు. అత్యంత రుచిగా ఉండే ఈ చేపల్లో ఔషధగుణాలు ఉంటాయని మత్స్యకారులు తెలిపారు.













