సీఎస్ సమీక్షలపై మండిపడ్డ ఆర్ధికమంత్రి యనమల
ఆర్ధిక శాఖ సమీక్షలు, ఎన్నికల కౌంటింగ్ పై సమీక్షలపై యనమల ఆగ్రహం
పేదల పథకాలకు నిధుల విడుదలను సీఎస్ పశ్నించడం అహేతుకం: యనమల
3స్కీములకు ఈ బడ్జెట్ లో నిధులు లేవనడంపై అభ్యంతరం
పసుపు–కుంకుమ,పెన్షన్లు,రైతుల పెట్టుబడిసాయం బడ్జెట్ లో ఉన్నవే
ఈ పథకాలన్నీరాష్ట్ర కేబినెట్ లో ఆమోదించినవే. అసెంబ్లీ ఆమోదం పొందిన పథకాలే ఈ మూడు.
ఓటాన్ అకౌంట్ లో బడ్జెట్ కేటాయింపులు జరిగినవే.
ఇవి ఎలక్షన్ కోడ్ కిందకు రావని కోర్టులు కూడా చెప్పాయి
వీటిపై వైసిపి నేతలు అన్నికోర్టులకు వెళ్లి అక్షింతలు తిన్నారు.
ఢిల్లీ హైకోర్టు కూడా వైసిపి నేతల పిటిషన్లను తిరస్కరించింది
కొత్తగా సిఎస్ వీటిపై రివ్యూ చేసినట్లు మీడియాలో రావడం హాస్యాస్పదం
ఈ 3పథకాలపై 2019-20 బడ్జెట్ స్పీచ్ 2వ పేజి 7వ పాయింట్ లో చెప్పాం.
బడ్జెట్ లో స్పీచ్ లో ఉన్నవి ఎలక్షన్ కోడ్ కిందకు రావు
‘‘తీవ్ర ఆర్ధికలోటులో కూడా పెద్దఎత్తున రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని, మహిళా సంఘాలకు పసుపు–కుంకుమ అందిస్తామని, పెన్షన్ల మొత్తాన్ని 10రెట్లు పెంచుతామని’’ బడ్జెట్ స్పీచ్ లో చెప్పాం.
దేనికెన్ని నిధులు పెట్టామో బడ్జెట్ స్పీచ్ 31వ పేజి ఎన్ క్లోజర్స్ లో పేర్కొన్నాం
‘అన్నదాత సుఖీభవ’కు రూ.5వేల కోట్లు ఇస్తామని చెప్పాం
‘పసుపు–కుంకుమ’కు రూ.4వేల కోట్లు పెట్టినట్లు చెప్పాం
పెన్షన్లు 10రెట్లు చేస్తున్నట్లు స్పష్టంగా పేర్కొనడం జరిగింది
వృద్దులకు, వితంతువులకు రూ.10,401కోట్లు, దివ్యాంగులకు రూ.2,133కోట్లు, కల్లుగీత కార్మికులకు రూ.76కోట్లు ,డప్పు కళాకారులకు రూ.108కోట్లు కేటాయించినట్లు ఎన్ క్లోజర్స్ లో చెప్పాం
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ స్పీచ్ ను అసెంబ్లీ ఆమోదించింది.
ఎలక్షన్ కోడ్ రాకముందే రైతులకు,మహిళలకు చెక్కులు పంపిణీ చేశాం
ఈ పథకాలకు ఎన్నికల కోడ్ అమలు కాదని కోర్టులు చెప్పాయి
ఇప్పుడు మళ్లీ వీటిపై సీఎస్ రివ్యూ చేసినట్లు మీడియాలో కథనాలు హాస్యాస్పదం.













