సచివాలయానికి 2 ఆకృతులు ఎంపిక
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంలోని నిర్మించబోయే సచివాలయం భవనాల నమూనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. వెలగపూడి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భవన నమూనాలను ఆయన పరిశీలించి ప్రాథమికంగా నమూనాలను ముఖ్యమంత్రి ఆమోదం లభించినట్టు సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర తెలిపారు. ఈ భవనాల నమూనాలను ప్రజల అభిప్రాయాలు కోరుతూ సీఆర్డీఏ వెబ్సైట్లో, సోషల్ మీడియాలో, మన అమరావతి యాప్లో ఉంచుతారని తెలిపారు. ప్రజల నుంచి అత్యుత్తంగా ఎంపికైనా నమూనాను తుది దశలో నిర్మాణానికి ఎంపిక చేస్తారని కమిషనర్ పేర్కొన్నారు. సుమారు 40 లక్షల చదరపు అగుడుల వైశాల్యంలో నిర్మించే ఈ భవనాలలో 16వేల మంది ఉద్యోగులు, అధికారులు పని చేసుకోనే వీలుంటుంది. అత్యున్నత ప్రమాణాలతో నిర్మించే ఈ భవనాలలో సౌకర్యవంతంగా పని చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. రోజులో 5వేల మంది సందర్శకులు తమ పనులు కోసం సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను సందర్శించే వీలు కల్పించారు.













