అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దు : సుప్రీంకోర్టు
ఫైబర్ నెట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 30న విచారణ చేపడతామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం తెలిపింది. ఏపీ సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ఫైబర్నెట్ కేసులో ఈ నెల 30 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. సిల్క్ డెవలప్మెంట్ కేసులో తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. సెక్షన్ 17ఏ నిబంధన ఈ కేసులోనూ ఉన్నందున స్కిల్ కేసు తీర్పు వచ్చాక విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కేసు ముగిసేవరకూ అరెస్ట్ చేయబోమన్న నిబంధన కొనసాగించాలని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా, గత హామీ మేరకు ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు తెలిపారు.













