కాంగ్రెస్ జెండా పట్టుకున్న షర్మిల అజెండా మాత్రం వేరు.. మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి
కాంగ్రెస్ (Congress) పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (Y.S.Sharmila) .. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో (Andhra politics) సంచలనంగా మారుతున్న పేరు. అన్న పార్టీ అయినా.. కూటమి అయినా.. అవసరమైతే తన వాడి మాటలతో దాడి చేయడానికి షర్మిల అస్సలు జంకరు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల అనంతరం.. షర్మిల (Sharmila) ఒక ప్రజలలో బాగా పాపులారిటీ పెరిగింది కానీ ఆమెకు నీడనిచ్చిన కాంగ్రెస్ కి మాత్రం ఊహించిన పాపులారిటీ దక్కలేదు. దీంతో ప్రస్తుతం షర్మిలకు ఎన్నికలకు ముందు ఉన్న జోష్ ఇప్పుడు పార్టీలో కనిపించడం లేదు.
అప్పట్లో షర్మిల చుట్టూ తిరిగిన నాయకులూ కూడా ఇప్పుడు షర్మిల తీరుని తప్పు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆమె సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కూడా ఆమెను విమర్శించడం గమనార్హం. క్షేత్రస్థాయిలో కూడా ఆమెపై ఫిర్యాదులు వెళుతున్నాయి. తాజాగా మాజీ పీసీసీ చీఫ్ (P.C.C.Chief) రఘువీరారెడ్డి (Raghu Veera Reddy) కూడా అధిష్టానానికి ఆమె ఎజెండాపై ఓ లేఖను రాశారు. ప్రస్తుతం ఆయన రాసిన లేఖ పార్టీలో పెద్ద ఎత్తున చర్చలకు దారి తీస్తోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ కరెక్ట్ గా పని చేస్తే వచ్చే ఏడాదిన్నరలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ కాస్త వీక్ అయింది.. మరోపక్క కూటమిపై అసంతృప్తి మొదలవుతోంది. తరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ కరెక్ట్ గా ప్లాన్ చేస్తే తెలంగాణలో మ్యాజిక్ ఆంధ్రాలో కూడా రిపీట్ అయ్యా అవకాశం ఉంది. నిజానికి ఈ సమయంలో షర్మిల తమ పార్టీ వైపు మోటివేట్ చేసేలా కార్యక్రమాలను నిర్వహించాలి. అయితే ఆమె అటువంటి కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడం లేదు అనేది పార్టీలోని సీనియర్ల మాట. తనకు నచ్చిన రీతి అజెండాను రూపొందించుకుంటున్నారే తప్ప రాష్ట్రంలో ఆమె పార్టీ కోసం పనిచేయడం లేదు అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. షర్మిలను నమ్ముకుంటే మరొక పది సంవత్సరాలు గడిచిన ఓటు బ్యాంకు పెరికే అవకాశం లేదు అని పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఎలా నెట్టుకొస్తారో చూడాలి.













