చంద్రబాబుకు ఇచ్చినట్లే.. సీఎం జగన్‌కూ నోటీసులు ఇవ్వాలి
అసైన్డ్ భూముల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇచ్చినట్లే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నోటీసులు ఇవ్వాలని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాల పేరిట దళితుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని ఆయన ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అసైన్డ్ భూముల్ని దళితుల నుంచి లాక్కున్న వివరాలను సీఐడీ డీజీ సునీల్‌కుమార్ అందజేస్తామన్నారు. దళితులకు ఇందిరాగాంధీ, రాజీవ్, ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇచ్చిన భూముల్ని జగన్ లాక్కున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్‌కు సీఐడీ నోటీసులు ఇవ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు.













