వలస పక్షులకు ఇక పార్టీలో అవకాశం లేదు : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కడప జిల్లా జమ్మలమడుగు నేతలు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డిలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు భూపేష్రెడ్డికి జమ్మలమడుగు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జమ్మలమడుగు టీడీపీ కంచుకోటని తెలిపారు. జమ్మలమడుగులో పార్టీ కోసం పనిచేస్తున్న అందరికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. వైఎస్ జగన్ అన్నీ గాలిమాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారు ఉంటారే ఆనాడు అంబేడ్కర్ రాజ్యాంగం రాశారన్నారు.
ముఖ్యమంత్రి గాల్లో వచ్చారు, గాల్లోనే వెళ్లారని ఎద్దేవా చేశారు. వలస పక్షులకు ఇక పార్టీలో అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయడం లేదనేది రాసిపెడుతున్నానని అన్నారు. ఈసారా పనిచేసే వారికి మాత్రమే పార్టీలో పదవులని స్పష్టం చేశారు. పార్టీ మారి వచ్చే వాళ్లకు అవకాశం ఉండదని అన్నారు. సినిమా టిక్కెట్లు ఆన్లైన్లో పెట్టి అప్పు తెచ్చుకుంటారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నారు లేకపోతే తాకట్టు పెడుతున్నారు. సీఎంకు అనుభవం లేదని అహంభావం మాత్రం ఉందని విమర్శించారు.













