మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట
రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. అమరావతిలో అసైన్డ్ భూములకు సంబంధించి అవకతవకలు జరిగాయని సీఐడీ అధికారులు మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నారాయణ ఆరోగ్యం సరిగాలేదు. చికిత్స చేయించుకునేందుకు అవసరమైతే విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి అని ఆయన తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం నారాయణకు 3 నెలల ముందస్తూ బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.













