చరిత్రలో ఇదే మొదటిసారి… ఎన్నికలను
చరిత్రలో ఎన్నికలను బహిష్కరించడం ఇదే మొదటిసారి అని మాజీ మంత్రి జవహర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్ఈసీ నీలం సాహ్ని జగన్ బంట్రోతు, రబ్బరు స్టాంపులా పని చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులున్నాయని దొంగ, పోలీసు ఒకటయ్యారన్నారు. అందుకే ఎన్నికలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. టీడీపీ పారిపోయిందని సోము వీర్రాజు అంటున్నాడని ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. టీడీపీని కించపరస్తూ మాట్లాడితే సహించేది లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలను కళ్లు ఉండి చూడలేని కబోది సోము వీర్రాజు అని విమర్శించారు. ఎవరిపై పోరాటం చేయాలో మీకు తెలియదన్నారు. టీడీపీపై కాదని, వైసీపీ మీద పోరాటం చేయాలన్నారు. నోటాకి వచ్చిన ఓట్లు కూడా మీకు రాలేదన్నారు.













