ఫోక్సో చట్టం ద్వారా.. ఈ రోజు వరకు ఏ ఒక్కరికి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫోక్స్ చట్టం ద్వారా ఈ రోజు వరకు ఏ ఒక్కరికి పరిహారమెందుకు అందివ్వలేదో చెప్పాలని మాజీ మంత్రి జవహర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ దిశ పేరుతో ప్రచారమే చేస్తున్నారు కాని మహిళల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. బాధితుల వివరాల గోప్యత గురించి కాదు మా ఆందోళన, రాష్ట్రంలో మహిళల రక్షణ గాలిలో దీపాలెందుకు అయ్యాయో సీఎం చెప్పాలని ప్రశ్నించారు. దిశ పేరుతో ప్రచారానికి పరిమితమయ్యారు తప్పా నిందితులపై తీసుకున్న చర్యలు శున్యమన్నారు. అత్యాచారాలు, హత్యలకు మూలమైన మద్యం, గంజాయి నాటుసార, డ్రగ్స్‌పై చర్యలెందుకు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మధ్య నిషేధం ఆటకెక్కించిన శాంతి భద్రతలు ఎలా కాపాడతారో చెప్పాలని అన్నారు.













