ఏదో జరగకుంటే ఎందుకు ఓడిపోతాం?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివప్రసాదరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ఎన్నికల సందర్భంగా ఏదో జరిగిందనీ, అందుకే ఓడిపోయామని ఆయన ఆరోపించారు. లేదంటే టీడీపీ ఎందుకు ఓడిపోతుందని ఆయన ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి టీడీపీ శాసనసభా పక్ష సమావేశానికి హాజరైన అనంతరం కోడెల మీడియాతో మాట్లాడారు. టీడీపీ అనుకోని ఓటమి చవి చూసిందని తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో జరిగిందనీ, ఈ విషయాన్ని కొందరు తనకు చెప్పారని కోడెల వ్యాఖ్యానించారు. ఈవీఎంలపై అనుమానాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవలసని బాధ్యత ఈసీదేనని ఆయన సృష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందనీ, ఓడిపోయామని కుంగిపోవద్దని కోడెల ధైర్యం చెప్పారు.













