సీఎం చంద్రబాబుకి మంత్రి ఈటల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం వెళ్లేందుకు గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చారు. ఆ సమయంలో చంద్రబాబును కలిసేందుకు మంత్రి ఈటల హైదరాబాద్ నుంచి అమరావతికి వెళుతూ గన్నవరం ఎయిర్పోర్టులో దిగారు. దీంతో ఇద్దరు కలయిక గన్నవరం ఎయిర్ పోర్టు వేదికైంది. కాగా ఈ నెల 18వ తేదీన జరిగే తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అదించారు.













