మనది అన్నదమ్ముల అనుబంధం
తెలుగుప్రజల బంధం ఎప్పటికైనా అన్నదమ్ముల బంధమని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం చేబ్రోలులో జరిగిన రైతుల ఏరుకవా కార్యక్రమంలో ఈటల పాల్గొన్నారు. తనయుడు వివాహ వేడుకలకు సంబంధించి ఆహ్వానం పలకడానికి పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర నివాసానికి ఆయన వచ్చారు. పొన్నూరు మండలంలోని చేబ్రోలులో ఏరువాక కార్యక్రమానికి రావాల్సిందిగా నరేంద్ర మంత్రి ఈటలను ఆహ్వానించడంతో ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తెలుగు ప్రజలు అభివృద్ధే ముఖ్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రైతులు ఈ ఏడాది మంచి దిగుడబడులతో పంటలు పండించాలని ఆయన ఆకాంక్షించారు. రైతుల అభివృద్ధికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తుందన్నారు. పొన్నూరుకు రావడం, ఈ సమావేశంలో పాల్గొనడం తనను ఎంతగానో సంతోషపరిచిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే నరేంద్ర మంత్రి ఈటెలను ఘనంగా ఘనంగా సత్కరించారు.













