ఏపీలో చీకట్లపై..
సందు దొరికితే చాలు తెలంగాణ మంత్రులు.. ఏపీపై మాటల తూటాలు సంధిస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్, తర్వాత హరీశ్ రావు.. ఇప్పుడు మంత్రి ఎర్రబెల్లి సెటైర్లు వేశారు. ఏపీలో కరెంటు కష్టాలపై.. మంత్రి ఎర్రబెల్లి సంచలన కామెంట్ చేశారు. ప్రజంట్ అక్కడ కరెంట్ లేక.. తీగలపై బట్టలు ఆరేసుకునే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. గతంలో సీఎంలుగా ఉన్న రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణను ఎద్దేవా చేశారని.. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరూ గమనించాలన్నారు. తెలంగాణలో భూముల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయని ఆయన చెప్పుకొచ్చారు.













