కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఏపీలో వారికి విధులు
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ఆదేశాలతో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలను డీఈవోలు సేకరిస్తున్నారు. ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని విజయవాడలో నిర్వహించిన సీఈసీ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఉపాధ్యాయులనూ ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని సీఈసీ సూచించారు. శుక్రవారం ఉదయం 11 గంటల్లోగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు ఇవ్వాలని డీఈవోలను ఆదేశించారు. ప్రిసైడిరగ్, అసిస్టెంట్ ప్రిసైడిరగ్ ఆఫీసర్లుగా వారిని నియమించనున్నారు.













