ఈ ముగ్గురిలో ఎస్ఈసీ ఎవరో?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31 తో ముగియనుంది. దీంతో కొత్త ఎన్నికల కమిషనర్ నియమానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో కూడిన జాబితాను గవర్నర్ కార్యాలయానికి పంపింది. మాజీ సీఎస్ నీలం సాహ్ని పేరు కూడా ఉంది. ఈమె గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ప్రస్తుతం సీఎం ముఖ్య సలహాదారు పదవిలో ఉన్నారు. ఇక మరో పేరు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం. శామ్యూల్, మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రేమచంద్రారెడ్డి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆఫీసుకు పంపింది. ఈ ముగ్గురిలో గవర్నర్ ఎవరి పేరును ఆమోదిస్తే, వారినే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా ప్రభుత్వం నియమిస్తుంది.













