ఎన్నికల సంఘం ధాటికి గడగడలాడుతున్న వాలంటీర్లు..
వైసిపి రాకపోతే తమ ఉద్యోగాలకి భరోసా ఉండదు అని భావిస్తున్నారో ఏమో తెలియదు కానీ మొత్తానికి వాలంటీర్లు చల్లగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఎన్నికల సంఘాల ఆదేశాలను ధిక్కరించి.. ఎలక్షన్ కోడ్ ను పక్కనపెట్టి.. ప్రచారం చేస్తున్న వాలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, రేషన్ డీలర్లు ఆంధ్రాలో చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళ బండారం బయట పెట్టడం కోసం.. తగిన రీతిలో శిక్షించడం కోసం ఎన్నికల సంఘం కూడా తమ వంతు నిఘాను ఏర్పాటు చేసింది. ఇందులో దొరికిన వాళ్ళ జీవితాలు భయంకరంగా ఎఫెక్ట్ అయ్యాయి కూడా. ఎన్నికల సంఘం నిఘాల దొరికిన వారిని సస్పెండ్ చేయడమే కాకుండా రాబోయే ఐదు సంవత్సరాలలో ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు హాజరుకాకుండా డిబార్ చేస్తోంది. దీంతో జగన్ని నమ్ముకుంటే మొత్తానికే ఎసురు అని భావిస్తూ చాలా మంది వాలంటీర్లు ప్రచారం చేయకుండా వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పటికే ఇలా వైసిపికి అనుకూలంగా ప్రచారం చేస్తూ ఎన్నికల సంఘం చేతికి చిక్కిన 30 మందికి పైగా ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, వాలంటీర్ సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. ఇది వైసీపీకి పెద్ద షాక్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు.













