ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్
ఆంధప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానం భర్తీకి షెడ్యూల్ విడుదలయింది. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భారీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఆగస్టు 6న విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 13, కాగా, 24న పోలింగ్ అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాన్ని ప్రకటిస్తారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీమాన చేసిన స్థానానికి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం గమనార్హం. వచ్చే ఏడాది మార్చితో ఆ స్థానం గడువు ముగుస్తుండడంతో ఒక్క స్థానానికే నోటిఫికేషన్ విడుదల చేశారు.













