పోలింగ్ ఏజెంట్ల విషయంలో ఈసీ కీలక ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న టైంలో పోలింగ్ ఏజెంట్ల నియామకాలపై ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామక లిస్ట్‌ను రిటర్నింగ్ అధికారికి ముందుగా అందజేయాల్సిన అవసరం లేదని, పోలింగ్ రోజున బూత్ ప్రిసైడింగ్ అధికారికి వివరాలు అందజేస్తే సరిపోతుందని ఈసీ పేర్కొంది. ఈ విషయంలో ఏజెంట్లను ఆయా పార్టీల అభ్యర్థులు ధ్రువీకరించాలని పార్టీలకు కూడా సూచనలు జారీ చేసింది. అంతేకాకుండా ఎన్నికలు జరిగే రోజునే పోలింగ్ ఏజెంట్ల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని ప్రిసైడింగ్ ఆఫీసర్‌లకు ఈసీ సూచించింది. పోలింగ్ ఏజెంట్ల విషయంలో అధికార దుర్వినియోగం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రిసైడింగ్ అధికారులదేనని ఎన్నికల సంఘం పేర్కొంది. అలాగే ఏజెంట్ల నియామకం విషయంలో అభ్యంతరం తెలిపే అధికారం పోలీసులకు లేదని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.