వాలంటీర్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు.. షాక్ లో వైసీపీ
ఆంధ్రాలో ఎన్నికల హడావిడి షురూ అయింది. ఈ నేపథ్యంలో పొలిటికల్ పార్టీలు తమ వంతు ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇక ఎన్నికల ప్రచారంలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టిన ఎన్నికల కమిషన్ తన వంతు విధివిధానాలను స్పష్ఠీకరించింది. ఎన్నికల విధులు మరియు ఇతరతర ఎన్నికల సంబంధించిన అంశాలకు వాలంటీర్లను పూర్తిగా పక్కన పెట్టాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల ప్రచారానికి, ఇతరతర విధులకు ఉపయోగించకూడదు అని వారు స్పష్టం చేశారు. ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థను తమ ప్రభుత్వానికి పునాదిగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రూలింగ్ పార్టీకి ప్రజలకి మధ్య వీళ్ళు సారధులు, వారదులు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే వీరు వైసీపీ ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు అంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత వాలంటీర్లు.. స్వచ్ఛంద కార్యకర్తలు.. ఎన్నికల విధులకు దూరంగా ఉండాలి అని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ వార్త జగన్ సర్కారికి పెద్ద షాక్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.













